Vijayashanti: పవన్ భార్య పై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్! 10 d ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఆమెపై ట్రోలింగ్ చేయడం సరికాదని MLC విజయశాంతి మండిపడ్డారు. 'విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెజినోవాపై కామెంట్స్, ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసం. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలిచ్చారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు' అని ట్వీట్ చేశారు.